Hardik Pandya: ఆ జట్లకు వారిద్దరిలా.. భారత్‌కు హార్దిక్‌ టెస్టులు ఆడాలి: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

by Vinod kumar |
Hardik Pandya: ఆ జట్లకు వారిద్దరిలా.. భారత్‌కు హార్దిక్‌ టెస్టులు ఆడాలి: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్‌ పాండ్య టెస్టుల్లో కూడా ఆడాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ స్పందించాడు. వన్డేలు, టెస్టులు ఆడుతున్న హార్దిక్‌ పాండ్య టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహించాలని నాజర్ హుస్సేన్ సూచించాడు. అయితే పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధిస్తేనే బరిలోకి దిగాలని పేర్కొన్నాడు.

పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలక పాత్ర పోషించాలని తెలిపాడు. ఇంగ్లాండ్‌కు బెన్‌ స్టోక్స్‌, ఆసీస్‌కు కామెరూన్ గ్రీన్‌లా హార్దిక్‌ పాండ్య కూడా జట్టులో ఉంటే విదేశాల్లో భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. స్వదేశంలో టీమ్‌ ఇండియా అద్భుతంగా ఆడుతుందని, కానీ విదేశాల్లో మాత్రం నిరుత్సాహానికి గురవుతోందని వ్యాఖ్యానించాడు.

''భారత జట్టులో స్టోక్స్, కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌ వంటి కేటగిరీ ప్లేయర్స్ ఉండాలి. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం.. కనీసం 10 నుంచి 15 ఓవర్లు సీమ్‌ బౌలింగ్‌ వేసేలా ఉంటే టీమ్‌కు ఎంతో ప్రయోజనం. స్వదేశీ పిచ్‌లపై రోహిత్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఓవర్సీస్‌ పిచ్‌లపై హార్దిక్‌ పాండ్య వంటి ఆల్‌రౌండర్ టెస్టుల్లో అవసరం ఉంది'' అని నాజర్ హుసేన్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed