కోహ్లీ టెస్టు సెంచరీపై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ట్వీట్.. విరాట్ ఫ్యాన్స్ ఫైర్

by Vinod kumar |
కోహ్లీ టెస్టు సెంచరీపై ఐస్‌ల్యాండ్ క్రికెట్ ట్వీట్.. విరాట్ ఫ్యాన్స్ ఫైర్
X

న్యూఢిల్లీ: ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు కోహ్లీపై చేసిన ట్వీటే అందుకు కారణం. దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అది కూడా టీ20ల్లో. గతేడాది ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీతో వన్డేలోనూ శతక నిరీక్షణకు తెరదించాడు.

అయితే, టెస్టుల్లో మాత్రం కోహ్లీ సెంచరీ చేసి మూడున్నరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌పై టెస్టు సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 23 టెస్టులు ఆడిన అతను టెస్టు సెంచరీ సాధించలేకపోయాడు. దీనిపై ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు చెప్పే గణాంకాలు చాలామంది భారత అభిమానులకు నచ్చకపోవచ్చు. అయితే, కోహ్లీ సుదీర్ఘఫార్మాట్‌లో సెంచరీ సాధించి 23 టెస్టులు అయ్యాయి. చివరిసారిగా 2019లో సాధించాడు. ఇది చాలా సుదీర్ఘ కాలం' అని ట్వీట్‌ చేసింది. దాంతో కోహ్లీ అభిమానులు ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డుపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల విరాట్ మంచి ప్రదర్శన చేస్తున్నాడని, వరుస సెంచరీలు బాదిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed