ICC ODI Rankings : టాప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్

by Sathputhe Rajesh |
ICC ODI Rankings : టాప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ నిలిచారు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల జాబితాలో నెం.1గా నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అతను ఈ ఘనత సాధించాడు. మూడు వన్డేలో సిరీస్‌లో 12.62 సగటుతో 8 వికెట్లను పడగొట్టాడు. కేశవ్ మహారాజ్‌ను వెనక్కినెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20ల్లో సంజుశాంసన్, వరుణ్ చక్రవర్తి..

డర్బన్‌లో సెంచరీ చేసిన టీంఇండియా బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ 27 స్థానాలు ఎగబాకి టీ20ల్లో 39వ స్థానంలో కొనసాగుతున్నాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 బౌలర్ల జాబితాలో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 5వికెట్లు పడగొట్టిన భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ 100 బౌలర్లలో చోటు దక్కించుకున్నాడు. చక్రవర్తి 64వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story