- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Arjun S/O Vyjayanthi: ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ అండ్ యాక్షన్ లుక్‌లో కళ్యాణ్ రామ్

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). ఈ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామాలో విజయ శాంతి (Vijaya Shanti) కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌కు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. ఫస్ట్ సింగిల్ (First single) ‘నాయాల్ది’ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే క్రేజ్‌లో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇందులో కళ్యాణ్ రామ్ ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. తన ఇంటెన్స్ ప్రజెన్స్ సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ (Powerful) వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. కాగా.. రిలీజ్ డేట్ (Release date) అనౌన్స్ చేసిన సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి రాబోయే వేసవి సెలవుల అడ్వాంటేజ్ కానున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ను అందిస్తుందని హామీ ఇస్తున్నాము. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు’ అని తెలిపారు. కాగా.. ఇందులో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.