బంగ్లాదేశ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీ20 ప్రపంచకప్ జరిగేనా?

by M.Rajitha |
బంగ్లాదేశ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీ20 ప్రపంచకప్ జరిగేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయారు. దేశ పార్లమెంటు రద్దయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడే దిశగా రాజకీయాలు మారుతున్నప్పటికీ.. అల్లర్లు, ఆందోళనలు మాత్రం ఆగలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో బంగ్లా వేదికగా జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులను పర్యవేక్షిస్తునామని, ఇవే పరిస్థితులు కొనసాగితే టీ20 ప్రపంచకప్ వేదికను మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఐసీసీ తెలిపింది. టోర్నమెంట్ కు ఇంకా ఏడువారాల సమయం ఉన్నందున.. ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, మరో నాలుగు వారాలు ఇదే పరిస్థితి ఉంటే మాత్రం వేదికను భారత్ కు లేదా శ్రీలంకకు మార్చనున్నామని ఐసీసీ అధికారి ఒకరు మీడియాకు తెలియజేశారు. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబర్ 3 నుండి 20 వరకు జరగాల్సి ఉంది.

Next Story

Most Viewed