నా బయోపిక్ లో నేనే హీరో.! మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్

by Geesa Chandu |   ( Updated:2024-08-23 06:57:18.0  )
నా బయోపిక్ లో నేనే హీరో.! మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్
X

దిశ, వెబ్ డెస్క్: మిస్టర్ డిపెండబుల్, టీమిండియా ది వాల్ గా పేరుపొందిన రాహుల్ ద్రావిడ్.. భారత క్రికెట్ కు ఎన్నోసేవలను అందించాడు. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా భారత్ కు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ముఖ్యంగా టెస్ట్, వన్డే మ్యాచ్ ల విషయానికి వస్తే.. టీమిండియా జట్టుకే అడ్డు గోడలా నిలిచేవాడు. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా కూడా.. భారత్ లో యువ ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తూ, వారిని టీమిండియా భవిష్యత్ క్రికెటర్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇటీవలే టీమిండియాకు ప్రధాన కోచ్ గా తన జర్నీని విజయవంతంగా ముగించాడు. అయితే బుధవారం(ఆగస్టు 21) సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డులను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో కెప్టెన్ గా, కోచ్ గా భారత క్రికెట్ కు చేసిన సేవలకు గుర్తింపుగా.. రాహుల్ ద్రావిడ్ ను లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ ను తన బయోపిక్ గురించి అడిగారు. ఒకేవేళ మీ బయోపిక్ చేస్తే అందులో ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుందని రాహుల్ ను అడగగా.. దీనికి సమాధానంగా ద్రావిడ్ మాట్లాడుతూ.. డబ్బు ఎక్కువగా ఉంటే, నా బయోపిక్ లో నేనే హీరోగా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం రాహుల్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Next Story