Asia Champions Trophy: పాకిస్తాన్‌ పై విజయం సాధించిన భారత్

by Mahesh |   ( Updated:2024-09-14 10:07:14.0  )
Asia Champions Trophy: పాకిస్తాన్‌ పై విజయం సాధించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Hockey Asia Champions Trophy) 2024 చైనా వేదికగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్(India) జట్టు సత్తా చాటుతూ.. హాకీలో తమకు తిరుగులేదని నిరూపిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ సెమీస్ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్(Pakistan) జట్టుతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కాగా ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. భారత్‌తో పాటుగా కొరియా, పాకిస్థాన్ జట్లు సెమీస్ అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం మలేషియా, చైనా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పొజిషన్‌ను రేపు చైనా, జపాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నిర్ణయించనుంది. కాగా సెమీఫైనల్ మ్యాచ్‌లు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ సెమీస్ లో ఏ ఏ జట్ల మధ్య మ్యాచులు జరగాలన్నది కూడా రేపు జరిగే చైనా-జపాన్ మ్యాచ్ నిర్ణయిస్తుంది.

Advertisement

Next Story