- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద రెజర్లు చేస్తున్న ఆందోళనను ఉధృతం చేశారు. క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో రెజర్లకు భారీగా మద్దతు లభిస్తోంది. రెజ్లర్ల నిరసనకు ఖాప్ పంచాయతీ నేతలు, మహిళలు సంఘీభావం తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా నుంచి ఢిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. మార్చ్ నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. అటు తిక్రి సరిహద్దులోనూ పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా ఢిల్లీ సహా దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు పాదయాత్రగా చేరుకోవాలని పిలుపునివ్వడంతో పోలీసులు ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెండు వారాలుగా నిరసనలు చేస్తున్నారు. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినందున డబ్ల్యూఎప్‌ఐ చీఫ్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌ను తొలగించాలని, అలాగే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.