- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధ్రువ్ జురెల్‌పై కుమార్ సంగక్కర ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తొలిసారిగా భారత టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టులో అతనికి చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ధ్రువ్ జురెల్‌పై రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర ప్రశంసలు కురిపించాడు. టీమ్ ఇండియాకు జురెల్ ఎంపికవడం గర్వంగా, సంతోషంగా ఉందన్నాడు. ‘జురెల్ బ్రిలియంట్ ప్లేయర్. మంచి ఆటగాడు కూడా. అతను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. గత సీజన్‌లో అతను కష్టమైన పరిస్థితిలో జట్టుకు వచ్చాడు. మంచి పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో అతను మ్యాచ్ విన్నర్ ఆటగాడు. అయితే, టెస్టుల్లో అతని నైపుణ్యాలకు పరీక్ష తప్పదు.’ అని సంగక్కర చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది జురెల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 172.73 స్ట్రైక్‌రేట్‌తో 152 పరుగులు చేశాడు. ఫినిషర్ రోల్ పోషించిన జురెల్ పలు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌కు రాజస్థాన్ ఫ్రాంచైజీ జురెల్‌ను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే.