మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఉండాలి : Harmanpreet Kaur

by Vinod kumar |
మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఉండాలి : Harmanpreet Kaur
X

న్యూఢిల్లీ : భారత్‌లో మరిన్ని మహిళల టెస్టు మ్యాచ్‌లను నిర్వహించడంతోపాటు దేశవాళీ క్రికెట్‌ను పునరుద్ధరించాలని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. టెస్టు క్రికెట్ ప్రాధాన్యతను వివరించింది. ‘ఒక ప్లేయర్‌గా మరిని టెస్టు మ్యాచ్‌లు కోరుకుంటాను. చిన్నప్పటి నుంచి టీవీల్లో టీ20ల కంటే టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా చూశాం. టీ20 ఆడటం సరదాగా ఉంటుంది. కానీ, ప్రతి క్రికెటర్ టెస్టు మ్యాచ్ ఆడాలని కోరుకుంటారు. ఈ ఏడాది మేము రెండు టెస్టులు ఆడతున్నాం. ఒకటి ఇంగ్లాండ్‌తో. మరోటి ఆస్ట్రేలియాతో. మహిళా క్రికెట్‌లో ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపుతాయనుకుంటున్నా.

భవిష్యత్తులో మరిన్ని టెస్టులు ఉంటాయని ఆశిస్తున్నాం. మహిళా క్రికెట్‌లో టెస్టు మ్యాచ్‌లు తిరిగి పునరుద్ధరించాలి. టెస్టు ఫార్మాట్ మహిళా క్రికెట్‌కు చాలా ముఖ్యం.’ అని తెలిపింది. అలాగే, మహిళల దేశవాళీ క్రికెట్‌లోనూ మల్టీ డే మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు రెండు, మూడు రోజుల మ్యాచ్‌లు ఆడేవాళ్లం. ఇప్పుడు ఆడటం లేదు.ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో టెస్టుల తర్వాత మల్టీ డే మ్యాచ్‌లు తిరిగి పొందుతామనుకుంటున్నా. మనం ఎంత క్రికెట్ ఆడితే అంత మెరుగుపడతాం.’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed