హనుమవిహాకిరి షాకిచ్చిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్..!

by Dishanational6 |
హనుమవిహాకిరి షాకిచ్చిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్..!
X

దిశ, స్పోర్ట్స్: భారత టెస్టు క్రికెటర్ హనుమవిహారికి షాకిచ్చింది ఆంధ్రక్రికెట్ అసోసియేషన్. విహారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అతడి సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు బోర్డు తెలిపింది. సొంతగడ్డపైనే కంగారులకు ముచ్చెమటలు పట్టించిన విహారీ దేశవాళీ క్రికెట్ లో ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది దేశవాళీ సీజన్ ప్రారంభంలోనే ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు అప్పుడు ప్రకటించాడు. కానీ.. రంజీ సీజన్ ముగిశాక సోషల్ మీడియాలో ఆంధ్రా జట్టుకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు.

పొలిటీషియన్ కుమారుడైన తన తోటి ప్లేయర్ ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని మ్యాచ్ జరుగుతున్న టైంలో హనుమ విహారి తిట్టినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై విహారి, ఆ ప్లేయర్ ఇద్దరూ సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారి. అయితే ఆ తర్వాతే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందగా తనపై ఒత్తిడి వచ్చినట్లు ఎక్స్ వేదికగా తెలిపాడు విహారి. ఆంధ్ర జట్టులోని ఇతర ఆటగాళ్లు తనకు మద్దతుగా సంతకం చేసిన లేఖను కూడా పోస్ట్ చేశాడు.

హనుమవిహారి ఎక్స్ పోస్ట్ పై స్పందిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన అభిప్రాయాలను తెలిపేందుకు సరైన ప్లాట్ ఫాం ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించింది. షోకాజ్ నోటీసు ద్వారా విహారి తన అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం ఇచ్చినట్లు బోర్డు అధికారి తెలిపారు. అయితే ఈ నోటీసులపై విహారి ఇప్పటివరకు స్పందించలేదని బోర్డు అధికారి తెలిపారు.

మరోవైపు విహారి భారత్ తరఫున 16 టెస్టులు ఆడాడు. 2021 సిడ్నీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తిండిపోయేది. ఆ ఇన్నింగ్స్ లో అశ్విన్ తో కలిసి దాదాపు 4 గంటల పాటు క్రీజులో ఉండి భారత్ పరాజయం కాకుండా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.


Next Story