- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SRH అభిమానులకు శుభవార్త.. హైదరాబాద్ చేరుకున్న కీలక ప్లేయర్లు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 season) ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ కు ముందు మెగా వేలం జరగడంతో పలువురు కీలక ప్లేయర్లు తమ జట్లను వదిలి కొత్త జట్లలోకి వెళ్లారు.కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad team) లో దాదాపు కీలక ప్లేయర్లు, బ్యాటర్లు అందరూ అలానే ఉండిపోయారు. దీంతో ఆ జట్టు ఫర్మార్మెన్స్ పై ఈ సారి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో ఐదు రోజుల్లో మ్యాచ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే కీలక ప్లేయర్లు మొత్తం జట్టులో చేరిపోయారు. ముఖ్యంగా గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కి దూరం అయిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Captain Pat Cummins).. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నాడు.
అలాగే భారీ హిట్టర్ ట్రావిస్ హెడ్ (Travis Head), ఆడమ్ జంపా కూడా జట్టులో చేరుకున్నారు. దీంతో పాటుగా కొద్ది రోజులుగా వెన్నునొప్పి ఇబ్బంది పడుతున్న యువ ఆల్ రౌండర్, తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి.. యోయో టెస్టును పాస్.. అయిన తర్వాత హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మొదటి నుంచి పాట్ కమ్మిన్స్, నితీష్ గాయాలపైన సన్ రైజర్స్ అభిమానుల్లో పలు అనుమానాలు ఉండగా.. తాజాగా వారు జట్లలో చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో భారీ ఉపశమనం కలిగింది. అలాగే సన్ రైజర్స్ జట్టులో అత్యంత విద్వంసకర ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Clausen) ఒక్కడు మాత్రమే ప్రస్తుతం జట్టులో చేరాల్సి ఉంది.
ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా యువ ప్లేయర్లు హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో సన్ రైజర్స్ ప్లేయర్లే రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో SRH- A జట్టు SRH-B జట్టు.. బౌలర్లను ఊచకోత కోశారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. భారీ సిక్సర్లు ఫోర్లు బాదారు. ఈ మ్యాచులో రెండు జట్లు కలిపి ఏకంగా 500 కంటె ఎక్కువ పరుగులు చేశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరింత నమ్మకం పెరిగింది.
దీంతో ఈ సంవత్సరం SRH జట్టు కచ్చితంగా 300 పరుగులు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 23న, 27న జరిగే మ్యాచులకు సంబంధించిన టికేట్లను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా టికెట్లను కొనేందుకు జింకాన గ్రౌండ్స్ లో క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు. భారీ ఎత్తున క్యూలైన్లలో నిల్చోని సన్ రైజర్స్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.