- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అహ్మదాబాద్ పిచ్ నిప్పులు కురిపిస్తుందా?: పీసీబీ తీరుపై షాహిద్ అఫ్రిది అసహనం
న్యూఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత్‌లో పాకిస్తాన్ జట్టు పర్యటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) రోజుకో మాట చెబుతున్నది. అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. అయితే, అహ్మదాబాద్ వేదికగా అయితే తాము ఆడమని, వేరే వేదికకు మ్యాచ్‌ను మార్చాలని పీసీబీ వర్గాలు తెలుపగా.. తాజాగా భారత్‌కు వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వరల్డ్ కప్‌లో పాల్గొంటామని పీసీబీ చైర్మన్ నజం సేథి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో పీసీబీ తీరుపై తాజా ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అహ్మదాబాద్ పిచ్‌పై ఎందుకు ఆడకూడదనుకుంటున్నారో చెప్పండి?.. ఆ పిచ్ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా? లేకపోతే వెంటాడుతుందా?. పాకిస్తాన్ జట్టు అక్కడి వెళ్లి ఆడాలి. విజయం సాధించాలి. మీరు ఊహించిన సవాళ్లే అక్కడ ఉంటే.. విజయంతో వాటిని అధిగమించాలి. భారత అభిమానుల ముందు టీమ్ ఇండియాను ఓడించి మీరు ఏం సాధించారో వారికి చూపించండి’ అని తెలిపాడు.