Sanju Samson: ఇలాగైతే టీంలో ఉండవు.. సంజూకు మాజీ లెజెండ్ వార్నింగ్..!

by Vinod kumar |
Sanju Samson: ఇలాగైతే టీంలో ఉండవు.. సంజూకు మాజీ  లెజెండ్ వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీసులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విఫలం అయ్యాడు. తొలి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. దీన్ని ఎత్తి చూపిన మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా.. ఇలాంటి అవకాశాలను సంజూ రెండు చేతుల్తో అందిపుచ్చుకోవాలని సూచించాడు. లేదంటే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన సంజూ రనౌట్ అయ్యాడు. ఇక రెండో మ్యాచ్‌లో గేర్ మార్చే క్రమంలో ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సంజూకు ఈ సిరీస్ చాలా కీలకమైందని, ఒకవేళ అతను విఫలమైతే.. కొత్త కుర్రాడు జితేశ్ శర్మకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు.

'సంజూ శాంసన్.. నీకు వచ్చే అవకాశాలను వేస్ట్ చేసుకోకు. అలా వృధా చేసుకుంటే ఆ తర్వాత బాధ పడాల్సి వస్తుంది. టాపార్డర్‌లో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టేస్తే.. లోయర్ ఆర్డర్‌లో సంజూను పక్కన పెట్టలేరనే రూల్ లేదు కదా. ఇద్దర్నీ తీసేయొచ్చు. జితేశ్ శర్మను టీంలోకి తీసుకోవచ్చు' అని చెప్పాడు. 'సూర్యకుమార్ యాదవ్ వద్ద సత్తా లేదనే అనుమానమే అక్కర్లేదు. చివరి మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. అక్కడ పరుగు కోసం వెళ్లకుండా ఉండాల్సింది. అది కిషన్ చేసిన తప్పు. కానీ చివరకు అవుటైన వారిదే తప్పని చెప్పాలి. సూర్య కనుక ఆ సింగిల్ తీయకుండా.. కిషన్ అవుటై ఉండేవాడు. సూర్య అవుటవడం టీమిండియాకు ఏమాత్రం కలిసిరాలేదు' అని చోప్రా పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed