స్టార్ స్పోర్ట్స్ టీ20 జట్టులో ఐదుగురు భారత క్రికెటర్లు..

by Vinod kumar |   ( Updated:2023-12-28 14:23:42.0  )
స్టార్ స్పోర్ట్స్ టీ20 జట్టులో ఐదుగురు భారత క్రికెటర్లు..
X

న్యూఢిల్లీ : టెలివిజన్ స్పోర్ట్స్ చానెల్ స్టార్ స్పోర్ట్స్ ‘టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్ లాంటి క్రికెట్ లీగ్స్‌‌లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని స్టార్ స్పార్ట్స్ శుక్రవారం ప్లేయింగ్ 11ను ప్రకటించింది. ఇందులో ఓపెనర్లు‌గా శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ ఎంపికవ్వగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, రింకు సింగ్‌కు సెలెక్ట్ అయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కింది. ఇక, ఆస్ట్రేలియా నుంచి ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ జాసన్ బెహ్రెండోర్ఫ్, పాక్ నుంచి ఇమాద్ వసీమ్, షాహీన్ అఫ్రిది‌లకు స్థానం దక్కింది. వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు. అయితే, టీ20 ఫార్మాట్‌లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్న జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, కోలిన్ మున్రో, బౌలింగ్‌లో సత్తాచాటిన జమాన్ ఖాన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్‌లకు ఈ జట్టులో చోటు దక్కలేదు.

Read More..

AUS vs PAK 2nd Test: పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. భారీ ఆధిక్యంలో ఆసీస్

Advertisement

Next Story