Fawad Alam: పాక్‌కు గుడ్‌బై.. యూఎస్‌ఏకు వలస వెళ్లిన స్టార్‌ క్రికెటర్‌

by Vinod kumar |
Fawad Alam: పాక్‌కు గుడ్‌బై.. యూఎస్‌ఏకు వలస వెళ్లిన స్టార్‌ క్రికెటర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఫవాద్‌ ఆలమ్‌ తన సొంత దేశానికి బై బై చెప్పాడు. ఆట పరంగా స్వదేశంలో సరైన అవకాశాలు రాకపోవడంతో అతను యూఎస్‌ఏకు వలస వెళ్లాడు. పాక్‌ తరఫున 15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. మైనర్‌ లీగ్‌ క్రికెట్‌ టీ20 తదుపరి సీజన్‌లో తాను చికాగో కింగ్స్‌మెన్‌ తరఫున బరిలోకి దిగుతానని తెలిపాడు. ఫవాద్‌ ఆలం (37) 2007లో పాకిస్తాన్‌ తరఫున అరంగేట్రం (వన్డే) చేసి 2009 వరకు దాదాపుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు.

అనంతరం 2009లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన ఫవాద్‌ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాతి టెస్ట్‌ల్లో స్థానం దక్కించుకోలేకపోయిన ఫవాద్‌, తిరిగి మరో ఛాన్స్‌ కోసం 11 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఫవాద్‌ 2022 జులై పాక్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచి అవకాశాల కోసం నిరీక్షించిన అతను.. ఇక వెయిట్‌ చేసి ఉపయోగం లేదని.. పాక్‌ నుంచి యూఎస్‌ఏకు మార్చాడు.

పాక్‌ తరఫున 19 టెస్ట్‌లు, 38 వన్డేలు, 24 టీ20 ఆడిన ఫవాద్‌.. పాక్‌ 2009లో గెలిచిన టీ20 ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫవాద్‌ తన కెరీర్‌లో 5 టెస్ట్‌ సెంచరీలు, ఓ వన్డే సెంచరీ, 2 టెస్ట్‌ హాఫ్‌సెంచరీలు, 6 వన్డే హాఫ్‌ సెంచరీలు చేశాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన ఫవాద్‌ టెస్ట్‌ల్లో 2, వన్డేల్లో 5, టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed