బెట్టింగ్‌లు వేసి దొరికిపోయాడు.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం

by Harish |
బెట్టింగ్‌లు వేసి దొరికిపోయాడు.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడెన్ కార్స్‌ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. బెట్టింగ్‌కు పాల్పడినందుకు అతనిపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు‌కు చెందిన క్రికెట్ రెగ్యులేటర్ బాడీ వేటు వేసింది. 2017 నుంచి 2019 వరకు క్రికెట్ మ్యాచ్‌లపై కార్స్ బెట్టింగ్ వేశాడు. అయితే, ఆ మ్యాచ్‌ల్లో అతను ఆడలేదు. విచారణలో బెట్టింగ్‌కు పాల్పడినట్టు అతను అంగీకరించాడు. మే 28 నుంచి ఆగస్టు 28 వరకు అతనిపై నిషేధం కొనసాగనుంది. కాగా, 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కార్స్ ఇంగ్లాండ్ తరపున 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed