- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్ట్ క్రికెట్‌లో England సంచలనం.. ఒక్కరోజే 506 పరుగులు
దిశ, వెబ్ డెస్క్: టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు సంచలనం సృష్టించింది. 145 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ ఆడిన ఇంగ్లాండ్ అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌తో తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా గురువారం జరిగింది. 1910లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్లకు 494 పరుగులు చేసింది.
112 ఏళ్లుగా ఈ రికార్డును ఏ జట్టు అందుకోలేకపోయింది. ఇంగ్లాండ్ జట్టు 506 పరుగులను 4 వికెట్లు కోల్పోయి కేవలం 75 ఓవర్లలో చేయడం మరో విశేషం. ఓపెనర్లు జాక్ క్రాలీ (111 బంతుల్లో 122, 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107, 15 ఫోర్లు), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఓలి పోప్ (104 బంతుల్లో 108, 14 ఫోర్లు), మిడిలార్డర్ లో హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 బ్యాటింగ్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 పరుగులు) క్రీజులో ఉన్నాడు. కాగా జో రూట్ ఒక్కడే31 బంతుల్లో 23 తక్కువ పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వెలుతురు లేమి కారణంగా ఎంపైర్లు 75 ఓవర్లు ఆడించారు. మొత్తం 90 ఓవర్లు ఆడిస్తే స్కోరు 600 దాటేది.