- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ENG vs WI : రెండో టెస్టూ ఇంగ్లాండ్‌దే.. సిరీస్ కైవసం
దిశ, స్పోర్ట్స్ : విండీస్‌తో ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టును ఇంగ్లాండ్ ఆదివారం చేజిక్కించుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్‌ను 271 పరుగుల తేడాతో ఓడించింది. స్పిన్నర్ షోయబ్ బషీర్(5/41) ఐదు వికెట్లతో చెలరేగి మరో రోజు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఇంగ్లిష్ జట్టు వరుసగా రెండో టెస్టునూ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 248/3తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. జోరూట్(122), హ్యారీ బ్రూక్(109) శతకాలతో రెచ్చిపోవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 400కుపైగా స్కోరు సాధించింది. దీంతో విండీస్ ముందు ఇంగ్లాండ్ 384 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన దూకుడును కొనసాగించలేకపోయారు. షోయబ్ బషీర్ స్పిన్ ధాటికి పెవిలియన్‌కు క్యూకట్టారు. క్రిస్ వోక్స్, అట్కిన్సన్ సైతం చెరో రెండు వికెట్లతో రాణించారు. దీంతో విండీస్ 36.1 ఓవర్లలోనే 143 పరుగులే చేసి కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ బ్రాత్‌వైట్ చేసిన 47 పరుగులే టాప్ స్కోర్. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం కావడంతో ఈ నెల 26 నుంచి 30 మధ్య జరిగే మూడో టెస్టు నామమాత్రమే కానుంది.
- Tags
- #ENG vs WI