- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ENG vs WI :హోడ్జ్ శతకం.. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిస్తున్న విండీస్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 416 పరుగులు చేయగా.. విండీస్ దీటుగా బదులిస్తోంది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరేబియన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. మొదట విండీస్ కాస్త తడబడింది. ఓపెనర్ మికైల్ లూయిస్(21), కిర్క్ మెకెంజీ(11) విఫలమవ్వగా.. మరో ఓపెనర్, కెప్టెన్ క్రెయింగ్ బ్రాత్‌వైట్(48) పర్వాలేదనిపించాడు.
84 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్తున్న జట్టును కావెమ్ హోడ్జ్(120) ఆదుకున్నాడు. సెంచరీతో కదం తొక్కి జట్టును పోటీలోకి తెచ్చాడు. టెస్టుల్లో అతనికి ఇదే తొలి శతకం. అతనితోపాటు అలిక్ అథనాజ్(82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నాలుగో వికెట్‌కు 175 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అథనాజ్‌ను అవుట్ చేసి స్టోక్స్ ఈ జోడీని విడదీయగా.. స్కోరు 300 దాటిన తర్వాత హోడ్జ్ కూడా పెవిలియన్ చేరాడు. జాషువా డా సిల్వ(32 నాటౌట్), జాసన్ హోల్డర్(23 నాటౌట్) ఆచితూచి ఆడుతూ రెండో రోజును ముగించారు. విండీస్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు వెనుకబడి ఉంది.
- Tags
- #ENG vs WI