ఒలంపిక్స్ లో మరో క్రీడాకారిణిపై అనర్హత వేటు

by M.Rajitha |
ఒలంపిక్స్ లో మరో క్రీడాకారిణిపై అనర్హత వేటు
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో మరో క్రీడాకారిణిపై అనర్హత వేటు పడింది. శుక్రవారం జరిగిన ఫ్రీ క్వాలిఫైయర్ బ్రేకింగ్ ఈవెంట్ లో ఆఫ్ఘన్ బ్రేక్ డాన్సర్ మనీజ తలాష్ మీద నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. ఈ ఈవెంట్ లో మనీజ "ఫ్రీ ఆఫ్ఘన్ ఉమెన్" అనే నినాదాన్ని కలిగి ఉన్న దుస్తులను ధరించి పాల్గొంది. తాలిబన్ల పాలనలో ఆఫ్ఘన్ మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ఆంక్షలను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా తాను ఈ దుస్తులను ధరించినట్టు మనీజ వెల్లడించింది. ఒలంపిక్ నిబంధనల ప్రకారం వేదికపై రాజకీయ, మతపరమైన స్లోగన్లను ప్రదర్శించడం నిషేధం ఉంది. వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. మనీజ చర్యలు ఒలంపిక్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తున్న కారణంగా తనపై అనర్హత వేటు వేస్తున్నట్టు ఒలంపిక్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మనీజ తలాష్ ఆఫ్ఘన్ నుండి పారిపోయి ప్రస్తుతం స్పెయిన్ లో నివసిస్తోంది. ఈ క్రమంలో తను శరణార్థుల జట్టు తరుపున ఒలంపిక్ లో పాల్గొని, ఆఫ్ఘన్ తాలిబన్ల పాలనపై నిరసన తెలిపింది.

Next Story

Most Viewed