- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cristiano Ronaldo :క్రిస్టియానో రొనాల్డోకు మరో షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే తన క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌పై ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసి.. కాంట్రాక్ట్ ముగియక ముందే తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రోనాల్డో కు మరో షాక్ తగిలింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న గుడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిన తర్వాత రొనాల్డో.. ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడే పోలీసులు అతన్ని హెచ్చరించి వదిలేశారు. అయితే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దీనిపై విచారణ జరిపి.. జరిమానా 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు), రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌కు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఒక రకంగా ఇది పోర్చుగల్‌తోపాటు రొనాల్డోకు పెద్ద ఊరట. మరోవైపు గురువారమే (నవంబర్ 24) పోర్చుగల్ తన తొలి మ్యాచ్‌ను ఘనాతో ఆడబోతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడబోతోన్నాడన్న ఆసక్తి నెలకొంది.