Abhishek Sharma : ఇండిగో సిబ్బందిపై భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఆగ్రహం..

by Sathputhe Rajesh |
Abhishek Sharma : ఇండిగో సిబ్బందిపై భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఆగ్రహం..
X

దిశ, స్పోర్ట్స్ : ఇండిగో సిబ్బందిపై భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని సోమవారం ఆయన ఆరోపించారు. తన ఒక్క రోజు హాలీడే మిస్ అయిపోయా అన్నాడు. సరైన సమయానికి వచ్చినా.. ఫ్లైట్ మిస్ కావడం పట్ల సిరీయస్ అయ్యాడు. ఘటనపై ఇన్ స్టా వేదికగా అభిషేక్ శర్మ స్పందించాడు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. కౌంటర్ మేనేజర్ సుస్మితా మిట్టల్, సిబ్బంది ప్రవర్తన సరిగా లేదు. సరైన సమయంలోనే తాను కౌంటర్ వద్దకు చేరుకున్నాను. కానీ సిబ్బంది నన్ను అనవసరంగా వేరే కౌంటర్ వద్దకు పంపారు. ఆ కౌంటర్ వద్దకు వెళ్లగానే చెక్ ఇన్ క్లోజ్ అయిందని చెప్పారు. దీంతో నేను నా ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు ఒక్క రోజు హాలీడే సిబ్బంది తీరుతో వృధా అయింది. అనంతరం సిబ్బంది కనీసం ఎలాంటి సహకారం అందించలేదు. ఇలాంటి సిబ్బంది, ఎయిర్ లైన్స్‌ను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.’ అని అభిషేక్ శర్మ ఇన్ స్టా స్టోరీ పెట్టాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఇంగ్లాండ్‌తో జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది.

Next Story