- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జట్టుతో క్రికెట్ ఆడలేం.. క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఆగస్టులో తటస్థ వేదికపై ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం తెలిపింది. అఫ్గాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, ఆస్ట్రేలియా ప్రభుత్వ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వరల్డ్ క్రికెట్‌లో మహిళల, బాలికలు పాల్గొనేందుకు బలమైన మద్దతును కొనసాగిస్తామని చెప్పింది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అఫ్ఘాన్ మహిళలు, బాలికల హక్కులు, స్వేచ్ఛపై అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నది. మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అఫ్గాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక ఆ దేశంతో ఆడేందుకు సీఏ నిరాకరించడం ఇది మూడోసారి. 2021లో ఏకైక టెస్టు మ్యాచ్, గతేడాదిలో యూఏఈలో వన్డే సిరీస్ నుంచి ఆస్ట్రేలియా తప్పుకుంది.
Advertisement
Next Story