ఆ రెండే ధోనీ ఆయుధాలు.. చిన్ననాటి కోచ్

by Vinod kumar |   ( Updated:2023-06-01 12:52:36.0  )
ఆ రెండే ధోనీ ఆయుధాలు.. చిన్ననాటి కోచ్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నీ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికి.. ఐపీఎల్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లకు ధీటుగా ఆడి జట్టుకు ఐదో కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్​ భట్టాచార్య​ తన శిష్యుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేశారు. ధోనిలోని ఈ మెరుపు వేగాన్ని గుర్తించారని అన్నారు. మహీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాడని.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని అప్పుడే తాను అనుకున్నట్లు ఆయన అన్నారు. "ధోనీ ప్రాక్టీస్‌ను మాత్రం ఎప్పటికీ వదలడు. ఇంకా ఫిట్‌గా ఉండటానికి కష్టపడుతున్నాడు. అతడిలోని ఈ అంశాలే.. ధోనికి ఇతర యంగ్​ ప్లేయర్స్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. గేమ్‌లో యువ ఆటగాళ్లకు దీటుగా ఆడేందుకు అతడికి శక్తినిస్తోంది" అని భట్టాచార్య అన్నారు.

అలాగే ధోనీ రిటైర్‌మెంట్ గురించి చంచల్ ​భట్టాచార్య స్పందించాడు. "రిటైర్‌మెంట్‌కు సరైన సమయం అనేది లేదు. ఫిట్‌నెస్‌తో పాటు కంటి చూపు అనే రెండు కీలక ఆయుధాలు ఇప్పటికీ ధోనితోనే ఉన్నాయి. ఒక క్రికెటర్ దగ్గర అది ఉంటే.. అతడు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పక్కాగా అమలు చేస్తాడు" అని భట్టాచార్య అన్నారు.

Advertisement

Next Story

Most Viewed