- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో కోనేరు హంపికి తొలి ఓటమి
దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్ మరో డ్రా పొందారు. పురుషుల విభాగంలో నాలుగో రౌండ్‌లో గుకేశ్, వరల్డ్ నం.2, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో పాయింట్లు పంచుకున్నాడు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ ప్రత్యర్థి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 74 ఎత్తుల్లో ఇద్దరు డ్రాకు అంగీకరించారు. మరో గేమ్‌లో ప్రజ్ఞానంద, వరల్డ్ నం.3 హికారు నకమురా(అమెరికా)తో 19 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. మరోవైపు, విదిత్ గుజరాతి వరుసగా రెండో ఓటమిని పొందాడు. నాలుగో రౌండ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాషితో తలపడిన విదిత్ 44 ఎత్తుల్లో గేమ్‌ను కోల్పోయాడు. గుకేశ్(2.5 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ప్రజ్ఞానంద(2.0), విదిత్(1.5) వరుసగా 4వ, 5వ స్థానాల్లో ఉన్నారు.
ఇక, ఉమెన్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి టోర్నీలో తొలి ఓటమిని అంగీకరించింది. వరుసగా మూడు రౌండ్లలో డ్రా చేసుకున్న ఆమె నాలుగో రౌండ్‌లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్ సలిమోవా చేతిలో 62 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరో గేమ్‌లో ఆర్.వైశాలి.. రష్యా క్రీడాకారిణి అలెగ్జాండ్రాతో నాలుగో రౌండ్‌ను డ్రాగా ముగించింది. ఈ టోర్నీలో రెండో డ్రా పొందిన వైశాలి 2.0 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా.. కోనురు హంపి(1.5) 6వ స్థానంలో ఉన్నది.