IPL2023: ‘ఎట్టి పరిస్థితుల్లో ముంబై ఫైనల్‌కు రావొద్దు’

by GSrikanth |
IPL2023: ‘ఎట్టి పరిస్థితుల్లో ముంబై ఫైనల్‌కు రావొద్దు’
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో ఇవాళ కీలక మ్యాచ్ జరుగనుంది. ఫైనల్‌‌లో చెన్నైతో తలపడేందుకు ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌కు ముంబై ఇండియన్స్ మాత్రం రావద్దని బ్రావో అభిప్రాయపడ్డారు. తాను ఇలా ఎందుకు అంటున్నానో తన ఫ్రెండ్ కీరన్ పోలార్డ్‌కు తెలుసరి సరదాగా చెప్పుకొచ్చాడు. అంతేగాక, ముంబై ఇండియన్స్ ఫైనల్ రావద్దని సీఎస్‌కే సైతం అభిమానులు కోరుకుంటున్నారు.

ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ముంబైకే మెరుగైన రికార్డు ఉండటంతో ఆ జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడగా.. ముంబై ఇండియన్సే మూడుసార్లు గెలిచింది. చెన్నై మాత్రం ఒక్కసారే విజయాన్నందుకుంది. అది కూడా అప్పుడెప్పుడో 2010లో తొలిసారి టైటిల్ అందుకున్నప్పుడు. ఆ తర్వాత 2013, 2015 , 2019 ఫైనల్స్‌లో ఇరు జట్లు తలపడగా.. ముంబై ఇండియన్సే ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌కు రావద్దని సీఎస్‌కే ఫ్యాన్స్, డ్వేన్ బ్రావో భావిస్తున్నారు.

Advertisement

Next Story