- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy-2025: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. కెప్టెన్ రిజ్వాన్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ఆరంభ మ్యాచ్‌లోనే అతిథ్య జట్టు పాకిస్థాన్ (Pakistan)కు బిగ్ షాక్ తగిలింది. కరాచీ (Karachi) వేదికగా న్యూజిలాండ్ (New Zealand)తో బుధవారం జరిగిన మ్యాచ్ 60 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఊహించని రీతిలో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ (Pakistan) తమ సెమీస్ అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంది. ఈ టోర్నీలో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితికి ఆ జట్టు చేరింది. జట్టు ఓటమిపై మ్యాచ్ అనంతరం మీడియాతో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Captain Mohammed Rizwan) మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
డెత్ ఓవర్లలో తమ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారని అన్నారు. టాపార్డర్ పేలవ బ్యాటింగ్ తమను ఓటమికి మరింత దగ్గర చేసిందని కామెంట్ చేశారు. అదేవిధంగా న్యూజిలాండ్ (New Zealand) తమ ముందుకు భారీ టార్గెట్‌ను పెడుతుందనే విషయాన్ని తాము ఊహించలేదని అన్నారు. కివీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నించామని కానీ, వారు అద్భుతంగా ఆడి రెండు సెంచరీలను చేశారని కామెంట్ చేశారు. మొదట పిచ్ బౌలింగ్‌కు అనుకూలించినా.. ఆ తరువాత బ్యాటింగ్ అనుకూలంగా మారిందని అన్నాడు. ఇక ఫకార్ జమాన్ (Fakhar Zaman) గాయంపై స్పష్టత రాలేదని, అతడికి మెడికల్ రిపోర్ట్స్ వచ్చాక అసలు విషయం తెలుస్తుందని తెలిపారు. రాబోయే మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేస్తామని మహమ్మద్ రిజ్వాన్ అన్నారు.