- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరల్డ్ నం.3కి షాకిచ్చిన భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్
దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి రెండో రౌండ్‌లో గెలుపొందాడు. తొలి రౌండ్‌ను డ్రాగా ముగించిన విదిత్.. రెండో రౌండ్‌లో వరల్డ్ నం.3, అమెరికాకు చెందిన హికారు నకమురాకు షాకిచ్చాడు. హోరాహోరీగా సాగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన విదిత్ 47 ఎత్తుల్లో నకమురాను ఓడించాడు. అలాగే, మరో భారత క్రీడాకారుడు గుకేశ్ కూడా గెలుపు ఖాతా తెరిచాడు. రెండో రౌండ్‌లో సహచరుడు ఆర్.ప్రజ్ఞానందపై 33 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. దీంతో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద టోర్నీలో తొలి ఓటమిని పొందాడు. మహిళల కేటగిరీలో అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి రెండో రౌండ్‌ను కూడా డ్రాగా ముగించింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కాటెరినా లగ్నోను ఎదుర్కొన్న ఆమె 38 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరో భారత క్రీడాకారిణి వైశాలి తొలి ఓటమిని పొందింది. రెండో రౌండ్‌లో చైనాకు చెందిన టాన్ ఝోంగి చేతిలో 34 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించింది. దీంతో రెండో రౌండ్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు దక్కాయి.