టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో నేపాల్‌పై కెనడా విజయం

by Harish |
టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో నేపాల్‌పై కెనడా విజయం
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెల 2 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. అంతకుముందు టోర్నీలో పాల్గొనే జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై కెనడా 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కెనడా ఇన్నింగ్స్‌లో నికోలస్ కిర్టన్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీందర్‌పాల్ సింగ్(41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనకు దిగిన నేపాల్‌‌.. కెనడా బౌలింగ్‌లో తేలిపోయింది. 19.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. కుషాల్ మల్లా(37) టాప్ స్కోరర్. డిల్లాన్ హేలిగర్(4/20) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. కాగా, జూన్ 1న జరిగే వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed