BWF Rankings: మెరుగుపడిన పీవీ సింధు ర్యాంక్..

by Vinod kumar |   ( Updated:2023-08-08 12:14:51.0  )
BWF Rankings: మెరుగుపడిన పీవీ సింధు ర్యాంక్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్​ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపడింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరుకుంది. మరో స్టార్ షట్లర్ కితాంబి శ్రీకాంత్ 20వ స్థానానికి పడిపోయాడు. పీవీ సింధు.. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం బీవెన్​జాంగ్​చేతిలో ఓడిపోయి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్​ఫైనల్‌తోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

గతేడాది బర్మింగ్​హమ్ కామన్వెల్త్​గేమ్స్‌లో గోల్డ్​మెడల్ సాధించిన ఈ స్టార్.. అప్పటి నుంచి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడిన సింధు.. 19 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మరో స్టార్ షట్లర్ కితాంబి శ్రీకాంత్ 20వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్.. వరుసగా ప్రపంచ నంబర్ 9, 11 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed