ICC: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు బిగ్ షాక్

by Gantepaka Srikanth |
ICC: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌(Mohammad Siraj)కు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్(Adelaide Test) వేదికగా జరిగిన రెండో టెస్టులో సిరాజ్, ఆసిస్ ఓపెనర్ హెడ్(Travis Head) మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇరువురు పరస్పరం దూషించుకున్నారు. సెంచరీతో అప్పటివరకు చెలరేగుతున్న హెడ్‌ను.. చాకచక్యంగా సిరాజ్ ఔట్ చేశాడు. అనంతరం ఇరువురు ఒకరినొకరు సీరియస్‌గా చూసుకున్నారు. బయటకు వెళ్లు అని హెడ్‌కు సిరాజ్ సీరియస్‌గా చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఐసీసీ(ICC) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించింది.

దీంతో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెడ్‌ కూడా రూల్స్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఇద్దరు ఆటగాళ్లు తమ క్రమశిక్షణా రికార్డులపై ఒక్కో డీమెరిట్ పాయింట్స్ పొందారు. ఇది వారి ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపనుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు వరుసగా ఇది నాలుగో ఓటమి.

Next Story