Ajit Agarkar: Team India చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా..?

by Vinod kumar |   ( Updated:2023-07-05 10:31:43.0  )
Ajit Agarkar: Team India చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా ఊహాగానాలు వినిపించిన పేరే, కన్ఫ్మాం అయింది. పురుషుల క్రికెట్ జట్టు కొత్త చీఫ్ సెలక్టర్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ జులై 4న అగార్కర్ పేరును ప్రకటించింది. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాజంపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పేరును మంగళవారం ప్రకటించింది. సీఏసీ.. అగార్కర్‌ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బాధ్యతలు అప్పగించింది.

అయితే చీఫ్ సెలెక్టర్‌గా నియమితులైన అగార్కర్‌కు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అగార్కర్ ముందు వరకు ఈ వేతనం రూ.1 కోటీగా ఉండగా.. దీన్ని బీసీసీఐ మూడింతలు చేసింది. అగార్కర్ వేతనం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా.. క్రిక్‌బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒక కోటీ జీతం ఉండటంతో దిగ్గజ ఆటగాళ్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఆరంభంలో అజిత్ అగార్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందని ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించాడని పేర్కొంది.

ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలెక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచినట్లు తెలిపింది. ఈ వార్షిక వేతనంతో పాటు డెయిలీ, ట్రావెల్ అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. ఇక చీఫ్ సెలెక్టర్ జీతం రూ.3 కోట్లు ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ జీతం కంటే ఇది ఎక్కువని, ఆయన వార్షిక వేతనం రూ. 2 కోట్లు మాత్రమేనని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వార్షిక కాంట్రాక్టుల్లో గ్రేడ్ బీ ఆటగాళ్లు అందుకునే వేతనం‌తో సమానమని గుర్తు చేస్తున్నారు. గ్రేడ్ బీ ఆటగాళ్లకు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. భారత తరఫున 26 టెస్ట్‌లు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడిన అగార్కర్.. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు కూడా అగార్కర్‌పైనే ఉంది. 21 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ బాదాడు.

Advertisement

Next Story

Most Viewed