- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి 18న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. విదేశీ బోర్డులతో సంబంధాలపైనే చర్చ
దిశ, స్పోర్ట్స్: విదేశీ బోర్డులతో నేరుగా టైఅప్ అవ్వకుండా రాష్ట్రాల క్రికెట్ సంఘాలను నిరోధించే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమమైంది బీసీసీఐ. శిక్షణా శిబిరాలు, పోటీలు నిర్వహించేందుకు విదేశీ బోర్డులను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వొద్దని కోరుతుంది. అన్ని ప్రతిపాదనలు బీసీసీఐ ద్వారాలనే జరగాలని ఆశిస్తుంది. మార్చి 18న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ఢిల్లీ, పుదుచ్చేరి సహా అనేక రాష్ట్రాల క్రికెట్ సంఘాలు విదేశీ బోర్డులు, అసోసియేటెడ్ దేశాలతో చర్చలుజరిపాయి. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ నేపాల్ బోర్డుతో ప్రతిపాదనలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ వీటిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపోతే క్రికెట్ సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర యూనిట్లు తప్పనిసరిగా విదేశీ బోర్డులను భాగస్వామ్యం చేసుకోవచ్చని.. అయితే మాతృ సంస్థ అయిన బీసీసీఐ ద్వారానే అన్ని ప్రతిపాదనలు వెళ్లాలని తెలిపారు అధికారులు.
వచ్చే టీ20 ప్రపంచకప్ ముందు.. ఎక్స్‌పోజర్ ట్రిప్ కోసం నేపాల్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు గత నెలలో బీసీసీఐ కార్యదర్శి జైషాతో సమావేశమయ్యారు. బీసీసీఐ గతంలో కూడా అసోసియేట్ నేషన్స్‌కు సహాయం చేసింది. కరోనా సమయంలో అఫ్గానిస్థాన్..డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడాలో శిక్షణ సదుపాయాలను వాడుకున్నాయి.