- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Badminton : పతకం లేకుండానే ఇంటిదారిపట్టిన భారత్.. క్వార్టర్స్‌లోనే ఔట్

దిశ, స్పోర్ట్స్ : బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ. గత ఎడిషన్ 2023లో కాంస్యం నెగ్గిన భారత్.. ఈ సారి పతకం లేకుండానే ఇంటిదారిపట్టింది. చైనాలో జరుగుతున్న టోర్నీలో క్వార్టర్స్‌లోనే నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థికి కనీసం పోటీ ఇవ్వలేక వరుసగా మూడు గేములను కోల్పోయింది. మిక్స్‌డ్ డబుల్స్ గేములో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 13-21, 21-17, 13-21 తేడాతో హిరోకి మిడోరికావా-నట్సు సైటో ద్వయంపై పోరాడి ఓడపోయింది. తొలి గేము కోల్పోయిన భారత జంట రెండో గేములో నెగ్గి పుంజుకుంది. కానీ, నిర్ణయాత్మక మూడో గేములో ఓటమి నుంచి బయటపడలేకపోయింది. ఆ తర్వాత సింగిల్స్ మ్యాచ్‌లో మాళవికపై వరల్డ్ నం.8 టోమోకో మియాజాకి 21-12, 21-19తో విజయం సాధించింది. వరుసగా రెండో గేములను కోల్పోయి వెనుకబడిన జట్టును స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ కూడా ఆదుకోలేకపోయాడు. కెంటా నిషిమోటో చేతిలో 21-15, 15-21, 21-12 తేడాతో పరాజయం పాలవడంతో భారత్ ఓటమి ఖరారైంది. దీంతో ఆఖరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం రాలేదు.