- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబర్, రిజ్వాన్ అన్ సోల్డ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
దిశ, వెబ్ డెస్క్: 'ది హండ్రెడ్' లీగ్ వేలంపాటలో పాకిస్తాన్ క్రికెటరల్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ లకు ఊహిచని ట్విస్ట్ ఎదురైంది. టీ20 క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వీరిద్దరిని ఎవరూ కొనేందుకు ఆసక్తి చూపలేదు. లీగ్ లో భాగంగా బాబర్ ఆజమ్ కనీస ధర లక్ష యూరోలతో బరిలో దిగాడు. అయినా.. అతడని ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అద్భుతంగా ఆడిన మహమ్మద్ రిజ్వాన్ 12 మ్యాచుల్లోనే 550 పరుగులు చేశాడు. అదేవిధంగ బాబర్ ఆజమ్ 11 మ్యాచులు ఆడి 522 పరుగులు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసింది వీరిద్దరే. ఈ నేపథ్యంలోనే 'ది హండ్రెడ్' లీగ్ వేలంపాటలో వీరిద్దరికీ మంచి ధర పలుకుతుందని అంతా భావించినా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది.
బాబర్, రిజ్వాన్‌ను కొనేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్' లీగ్‌లో ఎనమిది జట్లు తలపడతాయి. వీటి కోసం జరిగిన డ్రాఫ్ట్‌లోనే బాబర్, రిజ్వాన్‌లకు చుక్కెరైంది. హండ్రెడ్ లీగ్‌లో జట్టు విజయం ప్రధానంగా భారీ షాట్లపైనై ఆధార పడి ఉంటుంది. బాబర్, రిజ్వాన్ ఇద్దరూ కూడా నెమ్మదిగా ఆడతారని.. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేవారు కాదని.. అందుకే ఎవరూ వారిని కొనేందుకు ఆసక్తి చూపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా గమనించిన చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారిద్దరిని ట్రోల్ చేస్తున్నారు. బాబర్ హాఫ్ సెంచరీ చేయాలంటేనే 100 బంతులు కావాలి, ఇక్కడ అప్పటికి మ్యాచ్ ముగిసిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.