- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్!
దిశ, వెబ్‌డెస్క్: మహిళా క్రికెటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టోర్నీ డబ్ల్యూపీఎల్. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ అలీసా హేలీ ఎన్నికైంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆమె తమకు విజయాలు అందిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. స్థానిక అమ్మాయి.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మను కాదని ఆమెకు కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మొదలవుతున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా ఐదు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన అలీసా హేలీ కి మంచి అనుభవం ఉంది. ఆమె 2010, 2012, 2014, 2018, 2020 ప్రపంచకప్పులో ఆసీస్‌కు కీలకంగా ఆడింది. గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌నూ గెలిపించింది. టీ20 క్రికెట్లో 128 స్ట్రైక్‌రేట్‌తో 2,446 పరుగులు చేసింది. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే మహిళల బిగ్‌బాష్‌లో సిడ్నీ సిక్సర్‌కు నాయకత్వం వహించింది.