హామీలు నెరవేర్చలేకపోయిన ప్రధాని మోడీ

by Ajay kumar |
హామీలు నెరవేర్చలేకపోయిన ప్రధాని మోడీ
X

- 11 ఏళ్లలో 11 పెద్ద అబద్దాలు

- పేదల కోసం సేవ చేసిన కాంగ్రెస్‌ను ఎందుకు సమర్థించరు

- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, ఆయన 11 ఏళ్లలో 11 పెద్ద అబద్దాలు అడారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు. కల్యాణ కర్ణాటకలోని 38 గ్రామీణ నియోజకవర్గాల్లో 1,116 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం కల్యాణ పథ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ పథకాన్ని జెవర్గీలో ప్రారంభించిన సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీలపై విరుచుకపడ్డారు. పదకొండేళ్లలో మోడీ పెద్ద పెద్ద అబద్దాలు చెప్పారు. విదేశాల్లో నుంచి నల్లధనం తీసుకొని వచ్చి ఒక్కొక్కరి ఖాతలో రూ.15 లక్షలు జమచేస్తానని అబద్దం చెప్పారు. అలాగే ప్రతీ ఏడాది 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తానని అన్నారు. ఇన్ని అబద్దాలు చెప్పినా మన యువత ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. కులం, మతం, ప్రవర్తన ఆధారంగా ఇలా చేస్తున్నారా అని ఖర్గే ప్రశ్నించారు.

పేదలకు సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసి.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను ప్రజలు ఎందుకు సమర్థించరని ఆయన అన్నారు. మోడీ మాత్రం నిత్యం అబద్దాలు వల్లెవేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తానని అన్నారు. కానీ అవి 40 నుంచి 50 శాతం మేర పెరిగాయని ఖర్గే దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా కింద లక్షలాది తయరీ ఉద్యోగాలను సృష్టిస్తానని చెప్పడం కూడా అబద్దమేనని అన్నారు. 2022 కల్లా భారతీయులందరికీ పక్కా ఇళ్లు అందిస్తానని చెప్పడం మరో పెద్ద అబద్దమి ఖర్చే చెప్పారు. రాజ్యసభకు జరిగిన చివరి ఎన్నికలతో సహా నేను పన్నెండు ఎన్నికల్లో ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయలేదని ఖర్చే చెప్పారు. నా పని తీరుతో మంచి ఫలితాలు సాధించడానికే శాయా శక్తులా కృషి చేస్తాన్నారు.

మోడీ అబద్దాలు చెబుతాడు. అతని మాట వినొద్దు అంటే మాత్రం మీరు బాధపడతారని ఖర్గే చెప్పారు.



Next Story

Most Viewed