- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన జకోవిచ్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత, సెర్బియా దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఈ వరల్డ్ నం.1 టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జకో 6-3, 6-3, 7-6(7-2) తేడాతో 30వ సీడ్, అర్జెంటీనా ఆటగాడు థామస్ ఎట్చెవెరీని చిత్తు చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోకు ఇది 100వ మ్యాచ్. ఈ స్పెషల్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జకో 2 గంటల 28 నిమిషాల్లో వరుసగా మూడు సెట్లు గెలుచుకుని ప్రత్యర్థి కథ ముగించాడు. తొలి సెట్ ఆసక్తికరంగానే మొదలైనా జకో 6వ గేమ్‌లో బ్రేక్ పాయింట్ పొందడంతోసహా మూడు గేమ్‌లను గెలుచుకోవడంలో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో 9వ గేమ్‌లో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ జకోదే అదో జోరు. 3వ గేమ్‌లో థామస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను లీడ్‌లోకి వెళ్లి.. 9వ గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి వరుసగా రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే, మూడో సెట్‌లో జకో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఇద్దరూ సర్వీస్‌లను కాపాడుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 12వ గేమ్‌ను థామస్ నెగ్గి మూడో సెట్‌ను టై బ్రేకర్‌కు మళ్లించాడు. అయితే, అక్కడ జకోనే పైచేయి సాధించి మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. ఆదివారం నాలుగో రౌండ్‌లో 20వ సీడ్ అడ్రియన్ మన్నారినో(ఫ్రాన్స్)తో జకో పోటీపడనున్నాడు. 4వ సీడ్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ), 5వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్(రష్యా) సైతం నాలుగో రౌండ్‌కు అర్హత సాధించారు. మూడో రౌండ్‌లో సిన్నర్ 6-0, 6-1, 6-3 తేడాతో 26వ సీడ్ సెబాస్టియన్ బేజ్(అర్జెంటీనా)పై సునాయాస విజయం అందుకోగా..రుబ్లేవ్ 6-2, 7-6(8-6), 6-4 తేడాతో సెబాస్టియన్ కొర్డా(అమెరికా)పై పోరాడి గెలిచాడు. 7వ సీడ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ 6-3, 6-0, 6-4 తేడాతో లూకా వాన్ ఆస్చే(ఫ్రాన్స్)ను ఓడించి ముందడుగు వేశాడు. ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో 20వ సీడ్ మన్నారినో(ఫ్రాన్స్) 7-6(7-4). 1-6, 6-7(2-7), 6-3, 6-4 తేడాతో 16వ సీడ్ బెన్ షెల్టాన్(అమెరికా)కు షాకిచ్చాడు.
సబలెంక ముందడుగు
ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక(బెలారస్) ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో సబలెంక 6-0, 6-0 తేడాతో 28వ సీడ్ లెసియా సురెంకో(ఉక్రెయిన్)ను మట్టికరిపించింది. సబలెంక ధాటికి సురెంకో ఒక్క గేమ్ కూడా గెలుచులేకపోయింది. కేవలం 52 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. 6 డబుల్ ఫౌల్ట్స్, 15 అనవసర తప్పిదాలతో సురెంకో మూల్యం చెల్లించుకుంది. 4వ సీడ్, అమెరికా యువ సంచలనం కోకా గాఫ్ నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో సహచర క్రీడాకారిణి పార్క్స్‌పై 0-6, 2-6 తేడాతో విజయం సాధించింది. 9వ సీడ్ క్రెజికోవా సైతం ముందడుగు వేసింది. 10వ సీడ్ హద్దాద్ మైయా(బ్రెజిల్) ప్రయాణం మూడో రౌండ్‌లో ముగిసింది. అన్‌సీడ్ ప్లేయర్ అలీనా కోర్టీవా చేతిలో 6-1, 6-2 తేడాతో హద్దాద్ మైయా ఓడిపోయింది.