Australia vs Scotland: జోష్ ఇంగ్లిస్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. రెండో T20లో ఆసీస్ ఘన విజయం

by Maddikunta Saikiran |
Australia vs Scotland: జోష్ ఇంగ్లిస్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. రెండో T20లో ఆసీస్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఎడిన్‌బర్గ్‌(Edinburgh)లోని గ్రాంజ్ క్రికెట్ క్లబ్‌ వేదికగా స్కాట్లాండ్ (Scotland) తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా (Australia) 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచులో ఆస్ట్రేలియన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్(Josh Inglis) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవ‌లం 43 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరుపున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన తొలి ఆస్ట్రేలియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించాడు.కాగా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్(Aaron Finch) 2013లో(47 బంతుల్లో)పేరిట ఉన్న రికార్డును ఇంగ్లిస్ బ‌ద్ధలు కొట్టాడు. ఈ మ్యాచులో స్కాట్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది.ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.కంగారూల తరుపున ఇంగ్లిస్(49 బంతుల్లో 103 పరుగులు;7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), గ్రీన్(Green)(29 బంతుల్లో 36 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు.స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు.

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.ఆస్ట్రేలియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కాట్లాండ్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ జట్టు తరుపున మెక్ ముల్లెన్(McMullen) ఒక్కడే 49 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు.మిగతవారెవరు ఆకట్టుకోకపోవడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) 4 వికెట్లు తీయగా, గ్రీన్ 2 వికెట్లు పడగొట్టాడు.కాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో రెండు మ్యాచులు గెలిచిన ఆసీస్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను (2-0)తో గెలుచుకుంది.అయితే నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed