Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. స్టార్‌ పేసర్‌ ఔట్..

by Vinod kumar |
Asia Cup 2023: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. స్టార్‌ పేసర్‌ ఔట్..
X

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌ తగిలింది. గాయం కారణంగా రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఇబాదత్‌ హుసేన్‌ చౌధురి జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని యువ సంచలనం తంజీమ్‌ హసన్‌ సకీబ్‌తో బంగ్లా క్రికెట్‌ బోర్డు భర్తీ చేసింది. అయితే ఇబాదత్‌ హుసేన్‌ పూర్తిగా కోలుకోలేదు.

సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడ్డ అతడికి మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమైనట్లు బీసీబీ చీఫ్‌ స్పోర్ట్స్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ దేబాశిష్‌ చౌధురి తెలిపాడు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న 29 ఏళ్ల ఇబాదత్‌కు ఆరు వారాల పాటు రెస్ట్‌ కావాలని పేర్కొన్నాడు. కాబట్టి ఆసియా కప్‌ టోర్నీకి అతడు దూరం కానున్నట్లు దేబాశిష్‌ వెల్లడించాడు. ఇబాదత్‌ నొప్పి తీవ్రమైందని.. అయితే, వరల్డ్‌కప్‌ నాటికి అతడు మైదానంలో దిగే విధంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నాడు.

ఆసియా కప్‌-2023కి బంగ్లాదేశ్‌ జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్‌ హుసేన్‌, మహ్మద్ నయీమ్

స్టాండ్‌ బై ప్లేయర్లు: తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్‌ హసన్ సకీబ్

Advertisement

Next Story