- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా కోచ్‌గా మెక్ డోనాల్డ్.. తిరస్కరించిన కోచ్
by Disha News Desk |
X
మెల్‌బోర్న్ : సీనియర్ ఫురుషుల జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఆండ్రూ మెక్ డొనాల్డ్‌ను నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. లాంగర్ పదవీకాలాన్ని పొడగిస్తూ సీఏ ప్రతిపాదించినా జస్టిన్ లాంగర్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. అంతేకాకుండా తన రిటైర్మెంట్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే లాంగర్ రాజీనామాను ఆమోదిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు శనివారం ధృవీకరించింది. పూర్తిస్థాయి హెడ్ కోచ్ నియామకం జరిగే వరకు ఆండ్రూ మెక్ డొనాల్డ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సాధించే వరకు కోచ్‌గా కొనసాగాలని లాంగర్‌ను సీఏ బోర్డు కోరగా అందుకు అతను సుముఖత వ్యక్తం చేయలేదు.
Advertisement
Next Story