ఫుట్‌బాల్‌‌కు ఆండ్రెస్ ఇనియెస్టా వీడ్కోలు..

by saikumar |
ఫుట్‌బాల్‌‌కు ఆండ్రెస్ ఇనియెస్టా వీడ్కోలు..
X

దిశ, స్పోర్ట్స్ : గేమ్‌లో దిగ్గజ ఆట‌గాడి కెరీర్ తుదిదశకు చేరుకుంది. సుదీర్ఘ కాలంగా ఫ్యాన్స్‌ను అల‌రిస్తున్న స్పెయిన్ లెజెండ్ ఆండ్రెస్ ఇనియెస్టా తన ఫేవరెట్ సాక‌ర్‌ ఆటకు వీడ్కోలు ప‌లక‌నున్నాడు.ప్రపంచంలోనే మేటి మిడ్ ఫీల్డర్ అయిన ఆండ్రెస్ ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం స్వయంగా తెలిపాడు.అక్టోబ‌ర్ 8న అధికారికంగా ఫుట్‌బాల్ గేమ్‌కు దూరం అవుతున్నట్లు వెల్లడించాడు. త‌న జెర్సీ నంబ‌ర్ 8 కావడంతో అదే రోజున ఆట‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమ‌వుతున్నట్లు సోష‌ల్ మీడియా వీడియో ద్వారా ఆండ్రెస్ తెలిపాడు.

త్వర‌లోనే మీ ముందుకు రాబోతున్నా 08.10.24 అనే క్యాప్షన్‌తో ఈ సాకర్ స్టార్ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, స్పెయిన్ గ్రేట్ ఫుట్‌బాల‌ర్ అయిన ఆండ్రెస్ ఇనియెస్టా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుపొందాడు. 2 ప‌ర్యాయాలు యూరో చాంపియ‌న్‌షిప్ (2008, 2012) సాధించిన జ‌ట్టులో భాగ‌మ‌య్యాడు. ఇప్పటివ‌ర‌కూ మిడ్‌ఫీల్డర్‌గా 131 మ్యాచుల్లో 13 గోల్స్ కొట్టిన ఇనియెస్టా.. ప‌రోక్షంగా 30 గోల్స్ చేయ‌డంలో స‌హ‌చ‌రుల‌కు సాయం చేశాడు. ఇక బార్సిలోనా క్లబ్ త‌ర‌ఫున 674 మ్యాచులు ఆడిన ఆండ్రెస్.. 57 గోల్స్ కొట్టడ‌మే కాదు 135 గోల్స్‌కు సాయం చేశాడు. త‌న సుదీర్ఘ సాకర్ గేమ్ కెరీర్‌లో మూడు ప్రపంచ క‌ప్‌లు ఆడిన ఘనత అతని సొంతం.

Advertisement

Next Story

Most Viewed