- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసభ్య పదజాలం వాడిన వెస్టిండీస్ బౌలర్.. ఐసీసీ తీసుకున్న చర్యలివే..!

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. సెయింట్ కిట్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో జోసెఫ్ అశ్లీల పదజాలం వాడినందుకు గాను ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 1ను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. మ్యాచ్‌కు ముందు స్పైక్(షూ)లతో పిచ్‌పైకి వెళ్లొద్దని ఫోర్త్ అంపైర్ జోసెఫ్‌కు సూచించాడు. అయితే ఆ సమయంలో జోసెఫ్ అసభ్య పదజాలాన్ని వాడినట్లు ఐసీసీ తేల్చింది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్‌ను సైతం జరిమానాగా విధించింది. అయితే 24 నెలల వ్యవధిలో రెండోసారి అల్జారీ జోసెఫ్‌కు జరిమానా పడటం గమనార్హం. జరిమానాకు పేసర్ అంగీకరించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు కుమార ధర్మసేన, లెస్లీ రీఫర్, థర్డ్ అంపైర్ ఆసిఫ్ యాకుబ్ ఫోర్త్ అంపైర్ గ్రెగొరి బ్రాత్ వైట్ ఈ మేరకు అభియోగాలు మోపారు. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రోవ్ ఈ చర్యలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ 67 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.