- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హర్మన్‌ప్రీత్ రనౌట్‌పై అలిస్సా హీలీ సంచలన వ్యాఖ్యలు..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే కీలక సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌటవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ రనౌట్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దురదృష్టవశాత్తు రనౌటయ్యానని హర్మన్ ప్రీత్ కన్నీటి పర్యంతమైతే.. స్కూల్ గర్ల్ మిస్టేక్ అంటూ కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.
ఈ రనౌట్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అది దురదృష్టం అనడం కంటే హర్మన్‌ప్రీత్ బద్దకమని చెప్పొచ్చని ఘాటుగా విమర్శించింది. హర్మన్‌ప్రీత్ రనౌట్ విషయంలో దురదృష్టం కంటే బద్ధకమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ రెండు మీటర్లు దాటేందుకు పూర్తిగా ఎఫర్ట్ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడింది.
Advertisement
Next Story