- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు తొలిసారిగా అల్కరాజ్
దిశ, స్పోర్ట్స్ : తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.2,కార్లోస్ అల్కరాజ్ ఆ దిశగా కీలక అడుగు వేశాడు. ఈ స్పెయిన్ యువ సంచలనం టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 2022లో యూఎస్ ఓపెన్, గతేడాది వింబుల్డన్ నెగ్గిన అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. మూడో రౌండ్‌లో వాకోవర్ ద్వారా అతను టోర్నీలో ముందడుగు వేశాడు. శనివారం మూడో రౌండ్‌లో చైనా ఆటగాడు షాంగ్ జున్‌చెంగ్‌తో అల్కరాజ్ తలపడ్డాడు. తొలి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చాటిన అల్కరాజ్ వరుసగా 6-1, 6-1తో గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా ప్లేయర్ గాయం కారణంగా మధ్యలోనే ఆట నుంచి తప్పుకోవడంతో అల్కరాజ్ వాకోవర్ ద్వారా నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. రష్యా ప్లేయర్, 3వ సీడ్ మెద్వెదేవ్, జర్మనీ స్టార్, 6వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సైతం ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించారు.