సంజూ.. వృథా చేసుకోవద్దు: ఆకాశ్‌ చోప్రా

by Vinod kumar |
సంజూ.. వృథా చేసుకోవద్దు: ఆకాశ్‌ చోప్రా
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20ల్లో యువకులు అదరగొడుతుండగా.. సీనియర్‌ సంజూ శాంసన్‌ మాత్రం రెండు టీ20ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో వచ్చే రెండు మ్యాచుల్లోనైనా అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ‘‘సంజూ నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో. ఇప్పుడు వృథా చేసుకుంటే తర్వాత అందిపుచ్చుకోలేవు. తర్వాత గుర్తు చేసుకుని బాధ పడాల్సి ఉంటుంది. ఇషాన్‌ కిషన్ సరిగా ఆడకపోయినప్పుడు సంజూ ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వీరిద్దరి మధ్యలోకి జితేశ్‌ శర్మ వచ్చేస్తాడు. విండీస్‌ పర్యటనలో జితేశ్‌ ఏంటో నిరూపించుకున్నాడు’’ అని చోప్రా పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed