- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యూజీలాండ్ సిరీస్‌కు అలీసా హీలీ దూరం

- డబ్ల్యూపీఎల్ కూడా ఆడని హీలీ
- గాయం నుంచి కోలుకోని క్రికెటర్
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలీసా హీలీ త్వరలో జరుగనున్న న్యూజీలాండ్ పర్యటనకు దూరమైంది. పాదానికి గాయమవడంతో కొంత కాలంగా హీలీ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ టెస్టులో కూడా ఆడలేదు. అంతే కాకుండా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు హీలీ దూరమైంది. యూపీ వారియర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హీలీ గాయం కారణంగా దూరమవడంతో దీప్తి శర్మను కెప్టెన్‌గా చేశారు. కాగా, అలీసా హీలీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆమెను మార్చి 21 నుంచి జరుగనున్న న్యూజీలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అలీసా హీలీ స్థానంలో తహిలా మెక్ గ్రాత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ షాన్ ఫ్లెగ్లర్ వెల్లడించారు. ఇక హీలీ గైర్హాజరీలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో బెత్ మూనీ వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టింది. న్యూజీలాండ్ సిరీస్‌కు కూడా ఆమెనే ఎంపిక చేశారు. అయితే నికోల్ ఫాల్టమ్‌ను బ్యాకప్‌గా తీసుకున్నారు. 25 ఏళ్ల ఫాల్టమ్ బిగ్ బాష్ లీగ్‌లో ఎనిమిది సీజన్లు ఆడింది. డబ్ల్యూబీబీఎల్‌ను గెలిచిన మెలబోర్న్ రెనిగేడ్స్ టీమ్‌లో ఫాల్టమ్ సభ్యురాలిగా ఉంది. కాగా.. న్యూజీలాండ్ పర్యటనలో మార్చి 21న తొలి టీ20, మార్చి 23న బే ఓవల్‌లో రెండో టీ20, మార్చి 26న వెల్లింగ్టన్‌లో ఆఖరి టీ20 జరుగనుంది.