- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy : ఆసిస్, అఫ్గాన్ మ్యాచ్ రద్దు.. కంగారులకు కలిసొచ్చిన వర్షం.. సెమీస్ బెర్త్ ఖరారు

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. లాహోర్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మ్యాచ్ వర్షార్పణమైంది. వర్షం పడటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. కీలక మ్యాచ్‌లో విజయం సాధించకుండానే సెమీస్‌కు అర్హత సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌటైంది. సెడిఖుల్లా అటల్(85), అజ్మతుల్లా(67) పోరాటంతో అఫ్గాన్.. ఆసిస్ ముందు టఫ్ టార్గెటే పెట్టింది.
అయితే, ఛేదనలో ఆసిస్ దూకుడుగా ఆడింది. మాథ్యూ షార్ట్(20) త్వరగానే అవుటైనా.. ట్రావిస్ హెడ్(59 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. స్మిత్(19 నాటౌట్)తో కలిసి హెడ్ జట్టును వేగంగా నడిపిస్తుండగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసిస్ 12.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కాసేపటి తర్వాత వర్షం ఆగినా ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో ఆసిస్ 4 పాయింట్లతో సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా నెగ్గినా ఆసిస్‌కు రెండో స్థానం దక్కుతుంది.
మరోవైపు, అఫ్గాన్ సెమీస్ ఆశలు ప్రస్తుతానికి సజీవంగానే ఉన్నా.. ముందడుగు వేయాలంటే అద్భుతమే జరగాలి. ప్రస్తుతం అఫ్గాన్, సౌతాఫ్రికా చెరో మూడు పాయింట్లతో ఉన్నాయి. అయితే, దక్షిణాఫ్రికా భారీ నెట్‌రన్‌రేట్ కలిగి ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో సఫారీలు భారీ తేడాతో ఓడితే అఫ్గాన్ ముందడుగు వేసే అవకాశం ఉంటుంది.