రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ వైస్ చైర్మన్..

by Vinod kumar |
రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ వైస్ చైర్మన్..
X

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రెజ్లర్లకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెటిక్స్ కమిషన్ వైస్ చైర్మన్ ఆచంట శరత్ కమల్ సంఘీభావం తెలిపారు. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందని.. తిరిగి వారంతా ట్రెయినింగ్‌కు వెళతారని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డీ అన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఏప్రిల్ 23 నుంచి భారత ప్రముఖ రెజ్లర్లు నిరసన ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

‘అథ్లెట్లు నిజంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఫెడరేషన్‌పై పోరాటం కారణంగా తమ కెరీర్ మొత్తాన్ని పణంగా పెట్టారు. పారిస్ ఒలింపిక్స్‌ పతకాన్ని వాళ్లు చేజార్చుకుని ఉండొచ్చు. కానీ వాళ్లు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఈ పోరాటం చాలా విలువైందని వారు నమ్ముతున్నారు. అథ్లెటిక్స్ కమిషన్ వైస్ చైర్మన్‌గా, అటగాళ్లుగా వారికి సంఘీభావం తెలపడమే కాకుండా అండగా నిలవాలని భావిస్తున్నాను. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని శరత్ కమల్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed